ప్రధాని మోడీ పాలన బ్రిటీషోళ్ల కన్నా ఘోరం!

ప్రధాని మోడీ పాలన బ్రిటీషోళ్ల కన్నా ఘోరం!

మీరట్ మహాపంచాయత్​లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 

మీరట్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు డెత్ వారెంట్ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రైతుల భూములను లాక్కుని, కొంత మంది క్యాపిటలిస్టులకు కట్టబెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన రైతుల మహాపంచాయత్ లో కేజ్రీవాల్ మాట్లాడారు. ప్రధాని మోడీ సర్కార్ పాలన.. బ్రిటిష్ పాలన కన్నా దారుణమని విమర్శించారు. బ్రిటిష్​ పాలకులు సైతం రైతులపై ఇంతటి అణచివేతకు పాల్పడలేదన్నారు. ‘‘కొత్త అగ్రి చట్టాలతో రైతులు తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మారిపోతారు. అందుకే వారు డూ ఆర్ డై అన్న పరిస్థితిలో పోరాడుతున్నారు.

అలాంటి రైతులపై నేడు కేంద్రంలోని బీజేపీ సర్కార్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారంటూ కేసులు పెడుతోంది. మన రైతులను బీజేపీ నేతలు టెర్రరిస్టులని పిలుస్తున్నారు” అని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఇండియాను ప్రేమించే ఏ ఒక్క వ్యక్తీ రైతుల నిరసనకు వ్యతిరేకం కాదన్నారు. కొత్త అగ్రి చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం రైతులకు తప్పుడు హామీలు ఇస్తోందన్నారు. రైతులంతా బీజేపీకి ఓటేసి గెలిపించారని, కానీ ఈ ప్రభుత్వం మాత్రం.. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని లీగల్ రైట్ గా మార్చలేమని సుప్రీంకోర్టుకు చెప్పిందని అరవింద్​ కేజ్రీవాల్​ విమర్శించారు.