ఢిల్లీ ప్రజలే బీజేపీకి సమాధానం చెప్తరు: కేజ్రీవాల్

ఢిల్లీ ప్రజలే బీజేపీకి సమాధానం చెప్తరు: కేజ్రీవాల్

ఢిల్లీలో బీజేపీ రిలీజ్ చేస్తున్న వీడియోలు, ఆప్ ప్రభుత్వం ఇచ్చిన 10 హామీలే ఢిల్లీ మున్సిపల్ ఎలక్షన్స్ లో తీర్పు ఇస్తాయని సీఎం కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ రిలీజ్ చేస్తున్న వీడియోలకు ప్రజలే సమాధానం చెబుతారని చెప్పారు. లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను ఇరికించేందుకు కూడా బీజేపీ ప్రయత్నించినా అది సాధ్యం కాలేదని అన్నారు.సీబీఐ, ఈడీకి చెందిన 800 మంది సిబ్బంది 4 నెలలుగా వెతికినా సిసోడియాకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.