సీఎంను కొట్టినోడు వీడే : కుక్కలపై ప్రేమతో ముఖ్యమంత్రినే కొట్టాడంట..!

సీఎంను కొట్టినోడు వీడే : కుక్కలపై ప్రేమతో ముఖ్యమంత్రినే కొట్టాడంట..!

కుక్కలపై ప్రేమతో.. కుక్కలంటే ఇష్టంతో.. కుక్కలపై సుప్రీంకోర్టు తీర్పు క్రమంలో.. బాగా ఫీలయ్యి ఏకంగా ముఖ్యమంత్రినే కొట్టాడంట.. ఇదేమీ లాజిక్ అంటారా.. ఢిల్లీలో ఇలాగే జరిగింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఓ వ్యక్తి దాడి చేశాడు కదా.. వాడు వీడే.. ఈ ఫొటోలో ఉన్న వాడే ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి చేసింది. ఢిల్లీలో కుక్కల వ్యవహారం హాట్ గా నడుస్తుంది. వీధి కుక్కల విషయంపై సుప్రీంకోర్టు సైతం సీరియస్ వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కులను తరలించాలని..షెల్టర్లు ఏర్పాటు చేయాలన్న ఆదేశాల క్రమంలో.. ఈ కుక్కల ప్రేమికుడు బాగా ఫీలయ్యాడంట.. అందుకే సీఎంపై దాడి చేశాడంట.. పూర్తి వివరాల్లోకి వెళితే..

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై బుధవారం ఉదయం ఓ వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే.. ఢిల్లీలోని సివిల్స్ లైన్స్ లోని ఆమె అధికారిక నివాసంలో వ్యక్తి దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన రాజేష్ భాయ్ సకారియాగా గుర్తించారు. సకారియా కుక్కలను ప్రేమించేవాడని అతని బంధువు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడని దర్యాప్తు లో తెలిసింది.   

సుప్రీంకోర్టు తీర్పులో కలత చెందిన రాజేష్.. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి చేసినట్లు తెలుస్తోంది.  ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు కాగితాలు చేతపట్టుకొని రేఖాగుప్తాను సమీపించినట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ ఎన్ సీఆర్ పరిధిలోని వీధి కుక్కలనుషెల్టర్లకు తరలించాలని  సుప్రీంకోర్టు ఆదేశించడంతో తన కొడుకు మనస్తాపం చెందినట్లు.. రిక్షాలాగుతూ జీవనం సాగిస్తున్న రాజేష్ తరచుగా కుటుంబంలోని వ్యక్తులపై దాడి చేసేవాడని రాజేష్ తల్లి చెబుతోంది. 

ఢిల్లీలో వీధి కుక్కలు షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన క్రమంలో జంతు ప్రేమికులనుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ తీర్పు తర్వాత ఢిల్లీ సీఎం రేఖాగుప్తా,బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయెల్ పై జంతు ప్రేమికులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. 

సుప్రీంకోర్టు తీర్పును ఢిల్లీ సీఎం రేఖాగుప్తా స్వాగతించినప్పటికీ జంతు ప్రేమికులనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తుది తీర్పు వచ్చే వీధి కుక్కలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను అదేశించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. 

ఢిల్లీ సీఎం పై దాడికి సంబంధించి పుకార్లు ఉన్నాయి. రాజేష్ సకారియా బంధువు ఒకరు తీహార్ జైలులో ఉన్నాడని అతడిని జైలు నుంచి బయటికి తీసుకురావాలని కోరుకున్నాడని తెలుస్తోంది. 

దాడి చేసిన వ్యక్తి గుప్తాపై అరుస్తూ, ఆమెను చెంపదెబ్బ కొట్టి, దుర్భాషలాడాడని తెలుస్తోంది. సకారియా రేఖాగుప్తాకు కొన్ని పత్రాలను అందజేసి కోర్టు కేసును ప్రస్తావించి ఆమెను చెంపదెబ్బ కొట్టాడని వార్తలు వచ్చాయి. అతను ఆమె జుట్టును కూడా లాగి చెంపదెబ్బ కొట్టాడని తెలుస్తోంది.  

రాజేష్ జకారియాను ఢిల్లీ సీఎం భద్రతా సిబ్బంది వెంటనే పట్టుకున్నారు. అయితే దాడికి ఖచ్చితమైన కారణం ఏమైం ఉంటుందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.