ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కేజ్రీవాల్, కవిత కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కేజ్రీవాల్, కవిత కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు సెప్టెంబర్ 2 వరకు పొడిగించింది. మునుపటి కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను కోర్టు ముందు హాజరుపరచగా ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది . అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు ఈ కేసులో బెయిల్ బాండ్ ఇవ్వకపోవడంతో తీహార్ జైలులోనే ఉన్నాడు. అవినీతి ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో భాగంగా కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అంతకుముందు ఆగస్టు 5న ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.