ఢిల్లీలో మరోవారం పాటు లాక్‌డౌన్ పొడిగింపు

ఢిల్లీలో మరోవారం పాటు లాక్‌డౌన్ పొడిగింపు

ఢిల్లీలో మరో వారంపాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్  ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ విధించిన తర్వాత కరోనా కేసులు తగ్గుతున్నాయని.. అందుకే లాక్‌డౌన్ మరోసారి పొడిగించామని అధికారులు అంటున్నారు. కరోనా పాజిటివిటీ రేటు కూడా అదుపులోకి వస్తుండటంతో సీఎం కేజ్రీవాల్ లాక్‌డౌన్ పొడిగింపు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కాగా.. వ్యాపారులు మాత్రం లాక్‌డౌన్ పొడిగించొద్దని ప్రభుత్వాన్ని కోరాయి. లాక్‌డౌన్ పొడిగిస్తే తమకు భారీగా నష్టాలు వాటిల్లుతాయని వ్యాపారులు అధికారులతో మొరపెట్టుకున్నారు. కానీ, వ్యాపారం కన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే ప్రణాళిక ప్రకారమైనా షాపులు తెరవడానికి అనుమతులివ్వాలని కోరాయి. ఆ విషయంపై సీఎంతో చర్చిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కాగా.. లాక్‌డౌన్ పొడిగింపుతో ఢిల్లీలో మే 24 ఉదయం 5 గంటల వరకు అమలులో ఉండనుంది.