ఢిల్లీలో 24 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం

ఢిల్లీలో 24 నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు పొల్యూషన్ తగ్గుతూ వస్తోంది. దీంతో మూత పడిన స్కూళ్లు, కన్ స్ట్రక్షన్ పనులు 24వ తేదీ నుంచి  తిరిగి ప్రారంభించకోవచ్చని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.  పది రోజలుగా ప్రమాదకరస్థాయిలోనే ఎయిర్ పొల్యూషన్ ఉండటంతో.. జనం తీవ్ర అవస్థ పడుతున్నారు. కేజ్రీవాల్ సర్కార్ ఇప్పటికే కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టింది. స్కూళ్లు, కన్ స్ట్రక్షన్ పనులు బంద్ పెట్టింది. ఆఫీసులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించారు. ఈ చర్యలను కాస్త పొల్యూషన్ తగ్గుతోంది. 4వందల పాయింట్లకు పైగా నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.. నిన్న, ఇవాళ 3వందల పాయింట్లకు దగ్గరలో నమోదు అయింది. ఇంకా ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ కావాల్సి ఉందంటున్నారు అధికారులు. గాలులు వేగంగా వీస్తే ఢిల్లీలో వాయు కాలుష్యం తగ్గి.. గాలి నాణ్యత పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఢిల్లీ పరిసరాల్లోని ఫరీదాబాద్, ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ లో గాలి నాణ్యత కాస్త మెరుగు పడిందని తెలిపారు అధికారులు.