వింటర్ హాలిడేస్ పొడిగింపు నిర్ణయం ఉపసంహరణ

వింటర్ హాలిడేస్ పొడిగింపు నిర్ణయం ఉపసంహరణ

జనవరి 10 వరకు అన్ని పాఠశాలల్లో శీతాకాల సెలవులను పొడిగిస్తూ సర్క్యులర్ జారీ చేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరిచకుంది. ఈ సర్క్యులర్ 'తప్పుగా జారీ చేయబడింది' అని పేర్కొంటూ ఓ ప్రకటన చేసింది. శీతాకాల విరామాన్ని పొడిగించాలా వద్దా అనే దానిపై ఢిల్లీ విద్యా డైరెక్టరేట్ ఈ రోజు ఉదయం నిర్ణయం తీసుకోనుంది. అంతకుముందు ప్రకటన ప్రకారం, జనవరి 6న సెలవులు ముగియగా, జనవరి 8 నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.

నగరంలో తీవ్రమైన చలి, పొగమంచు, వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం తన మునుపటి ఆర్డర్‌లో, జాతీయ రాజధాని భూభాగం (NCT)లోని అన్ని ప్రభుత్వ-ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో జనవరి 10 వరకు శీతాకాలపు సెలవులను పొడిగించింది. రాబోయే రోజుల్లో దట్టమైన పొగమంచుతో పాటు తేలికపాటి వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఎలో అలెర్ట్ ను జారీ చేసింది.