ఢిల్లీలో పెరిగిన చలిగాలులు.. ఆందోళనలో ప్రజలు

ఢిల్లీలో పెరిగిన చలిగాలులు.. ఆందోళనలో ప్రజలు

ఉత్తర భారతదేశం చలితో వణికిపోతుంది. కనిష్టస్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పొగమంచు భారీగా కురుస్తోంది. ఇవాళ ఢిల్లీలో గాలినాణ్యత 273గా నమోదైంది. దాంతో గాలి నాణ్యత గురువారంతో పోల్చితే కొంచెం బెటర్ గా మారింది. కాగా.. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9గంటలైనా పొగమంచు తగ్గకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు.