V6 News

పవన్ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అభ్యంతరకర వార్తలను తొలగించండి

పవన్ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అభ్యంతరకర వార్తలను తొలగించండి
  • సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్  వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వారంలో తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని కోరుతూ పవన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై శుక్రవారం జస్టిస్ మన్మీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రీతమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరోరాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. పవన్ కల్యాణ్ తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ వాదనలు వినిపించారు. 

పవన్ ప్రమేయం లేకుండానే ఏఐతో వీడియోలు సృష్టిస్తున్నారని, సామాజిక మాధ్యమల్లో నకిలీ ఫొటోలు, వీడియోలను ప్రచారం చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.  దీనిపై స్పందించిన ధర్మాసనం.. సంబంధిత లింకులు, ఇతర సమాచారాన్ని 48 గంటల్లోగా సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు అందించాలని న్యాయవాదికి సూచించారు. అలాగే, పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే ఉన్న కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా సంస్థలు మెటా (ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రాం), గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆదేశించారు. అనంతరం విచారణను డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22కు వాయిదా వేశారు.