ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్​కు చుక్కెదురు

ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్​కు చుక్కెదురు

న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్​కు చుక్కెదురైంది. తమ బ్యాంక్ ఖాతాలను ఇన్​కం ట్యాక్స్ డిపార్ట్​మెంట్ ఫ్రీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు శుక్రవారం కొట్టివేసింది. 2014–15, 2015–16, 2016–17 సంవత్సరాలకు సంబంధించిన ట్యాక్స్ చెల్లింపుల పున:పరిశీలన ప్రొసీడింగ్స్​ను కాంగ్రెస్ సవాల్ చేసింది. 

అయితే, తామిచ్చిన నోటీసులు పరిమితులకు లోబడే ఉన్నాయని, రూల్స్​ను ఉల్లంఘించలేదని ఐటీ శాఖ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. పార్టీ సమర్పించిన ఎవిడెన్స్​లను బట్టి రూ.520 కోట్ల మేర తేడాలు వస్తున్నాయని తెలిపారు. ఈ వాదనలను సమర్థిస్తూ కాంగ్రెస్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.