మేడిగడ్డ బ్యారేజ్​పై దాఖలైన పిటిషన్ విచారణకు ఢిల్లీ హైకోర్టు నో

మేడిగడ్డ బ్యారేజ్​పై దాఖలైన పిటిషన్ విచారణకు ఢిల్లీ హైకోర్టు నో

న్యూఢిల్లీ, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్​పై రాష్ట్ర హైకోర్టుకే వెళ్లాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఇటీవల నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్ డీఎస్ఏ) మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించింది. భద్రతా లోపాలను గుర్తించినా కేంద్రం చర్యలు తీసుకోలేదని పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

ఎన్​డీఎస్ఏ సూచించినట్లు డ్యాం సేఫ్టీపై చర్యలు తీసుకునేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరా రు. ఈ పిటిషన్ జస్టిస్ సుబ్రమణియం బెంచ్ ముందుకు మంగళవారం విచారణకు వచ్చిం ది. హైదరాబాద్​కు సంబంధించిన అంశం ఇక్కడికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. ‘అక్కడి పరిస్థితులను చూసి స్థానిక హైకోర్టు జడ్జీలే బెటర్​గా విచారిస్తారు. డ్యామ్ ఎక్కడ ఉందో.. అక్కడి హైకోర్టును ఆశ్రయించడం మంచిది”అని సూచించారు.