
- ఏపీ భవన్ స్థలంలోని బాలాజీ టెంపుల్
- పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగణంలో ఉన్న బాలాజీ వెంకటేశ్వర మందిర్ కూల్చివేతపై ఢిల్లీ హైకోర్టు స్టేటస్ కో విధించింది. భవన్ వెనుక భాగంలో ఉన్న బాలాజీ వెంకటేశ్వర మందిర్ అక్రమణలో ఉందని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ఇటీవల ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ చర్యపై శివ, బాలాజీ, వెంకటేశ్వర మందిర్ పూజారి గోపాల్ కుమార్ మిశ్రా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
గురువారం దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సచిన్ దత్తా భవన్ రెసిడెంట్ కమిషనర్, ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు. అంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని, యధాతధ స్థితిని (స్టేటస్ కో) కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే విద్యుత్, నీటి సరఫరాను కూడా పునరుద్ధరించాలని ఆదేశించారు.