
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మంజూరైన బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. కేసును సమీక్షించే వరకు ట్రయల్ కోర్టు ఆదేశాలను అమలు చేయబోమని హైకోర్టు పేర్కొంది. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.
లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 48 గంటల పాటు బెయిల్ ఆర్డర్‌ను నిలిపివేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌ను కింగ్ పిన్‌గా పేర్కొంటూ ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారు.