INX మీడియా అవినీతి కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీనికి సంబంధించి జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ఆదేశాలు జారీ చేశారు. నిందితులకు డాక్యుమెంట్లను ఇవ్వాల్సిందిగా ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసులో నిందితులైన చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తికి నోటీసులు జారీ చేసింది.
