న్యూఢిల్లీ: రెజ్లింగ్‌లోకి తిరిగి అడుగుపెట్టేందుకు తనకు సరైన అవకాశం కల్పించాలని కోరుతూ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. డబ్ల్యూఎఫ్‌ఐ పాలసీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించింది. దాంతో వినేశ్‌కు తక్షణ ఉపశమనం దక్కలేదు. అయితే డబ్ల్యూఎఫ్‌ఐ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు తగిన సమాధానం ఇవ్వాలని కోర్టు వినేశ్‌కు సూచించింది.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్.. ఈ ఏడాది ఆరంభంలో మళ్లీ రింగులోకి వస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిబంధనల ప్రకారం తాను పోటీపడటానికి అర్హురాలినేనని స్పష్టం చేసింది. అయితే డబ్ల్యూఎఫ్‌ఐ రాజ్యాంగాన్ని, అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చే వరకు రీ ఎంట్రీకి అవకాశం లేదని సమాఖ్య పట్టుబట్టింది. దాంతో వినేశ్ కోర్టును ఆశ్రయించింది
