- విచారణను రద్దుచేసిన చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ: కోర్టు గౌరవానికి భంగం కలిగిస్తూ కేసు వర్చువల్ విచారణలో ఆశ్లీల వీడియోలు కలకలం రేపాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న కోర్టు విచారణలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఏకంగా మూడుసార్లు అశ్లీల వీడియోలు ప్లే చేసి విచారణకు తీవ్ర అంతరాయం కలిగించారు. బుధవారం ఢిల్లీహైకోర్టులో ఈ ఘటన జరిగింది.
చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కారియాతో కూడిన డివిజన్ బెంచ్ మధ్యాహ్నం కేసును విచారిస్తుండగా మొదటిసారిగా ఆశ్లీల వీడియోలు ప్లే అయ్యాయి. దీంతో వెంటనే విచారణను నిలిపివేశారు. తిరిగి విచారణ ప్రారంభించినప్పటికీ మరో రెండు సార్లు ఇదే విధంగా అశ్లీల వీడియోలు స్క్రీన్‌పై కనిపించాయి. అనంతరం ‘మీరు హ్యాక్ అయ్యారు’ అనే మెసేజ్ కనిపించింది. దీంతో వెంటనే వర్చువల్ విచారణను పూర్తిగా నిలిపివేశారు.

