ఆప్ నేతలకు లెఫ్ట్నెంట్ గవర్నర్ లీగల్ నోటీసులు

 ఆప్ నేతలకు లెఫ్ట్నెంట్ గవర్నర్ లీగల్ నోటీసులు

ఆప్ నేతలకు ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ లీగల్ నోటీసులు పంపారు. ఆప్ కు చెందిన అతిషీ, దుర్గేష్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్, జాస్మిన్ షాలకు గవర్నర్ నోటీసులు పంపారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని  ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

నోట్ల రద్దు సమయంలో ఖాదీ ఇండస్ట్రీస్ చైర్మన్ గా ఉన్న వీకే సక్సేనా అవినీతికి పాల్పడ్డారని ఆప్ నేతలు ఆరోపించారు. 1400 కోట్ల పాతనోట్లను కొత్త నోట్లుగా మార్చారన్నారు. దీంతో ఆప్ నేతలకు గవర్నర్ లీగల్ నోటీసులు పంపించారు.