
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. మార్చి 16 వరకు పిళ్లైని ఈడీ కస్టడీకి అప్పగించింది కోర్టు. పిళ్లై కస్టడీని పోడిగించాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. విచారణ సందర్బంగా సందర్భంగా పిళ్లైపై ఈడీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులివ్వగానే పిళ్లై తన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకున్నారని ఆరోపించింది. పిళ్లై స్టేట్ మెంట్ కు సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారాలున్నాయని తెలిపింది. విచారణ సందర్భంగా పిళ్లైని ఒత్తిడి చేయలేదని.. బెదిరించలేదని చెప్పింది.
2022 సెప్టెంబర్ 18 న పిళ్లై స్టేట్ మెంట్ ఇచ్చారని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. సెకండ్, థర్డ్ స్టేట్ మెంట్ లలో కూడా కవితకు సంబంధించిన వివరాలను పిళ్లై కన్ఫార్మ్ చేశారన్నారు. పిళ్లై తన స్టేట్ మెంట్ ను ఎందుకు మార్చుకున్నారో అర్థమవుతోందన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 16న మరోసారి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఇదే కేసులో కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును మార్చి 15న విచారించనుంది ఈడీ.