తెలంగాణ తలవంచదు.. ఈడీ నోటీసులపై కవిత 

తెలంగాణ తలవంచదు.. ఈడీ నోటీసులపై కవిత 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్  (mlc kavita) కుమార్తె కవిత. నోటీసులు అందాయని.. వాటిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 9వ తేదీ విచారణ రావాలని నోటీసుల్లో ఉందని.. అయితే ముందస్తు అపాయింట్ మెంట్స్ ఉన్నందున.. రేపటి విచారణకు హాజరు కావాలా లేక (delhi liquor scam)నోటీసులపై లేఖ రాయాలా అనేది.. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. మార్చి 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ లో మహిళా బిల్లు కోసం దీక్ష చేపట్టామని.. ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. (ED) ఢిల్లీలో దీక్ష కోసం మార్చి 8వ తేదీనే ఢిల్లీ వెళ్లాల్సి ఉందని.. అయితే ఈలోపే ఈడీ నోటీసులు రావటంతో.. ముందస్తు కార్యక్రమాలపై పార్టీలోనూ.. న్యాయ నిపుణులతోనూ చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. 

దీక్షకు ఒక రోజు ముందు విచారణకు (arun pillai) రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు కవిత. రాజకీయ రంగంలోమహిళలకు (ED) మహిళలకు తగిన గౌరవం కోసం పోరాడుతున్నానని.. ఇలాంటి సమయంలో దర్యాప్తు సంస్థలు విచారణకు రావాలని నోటీసులు పంపించినట్లు వెల్లడించారు కవిత.