- వచ్చే నెల 3న పరీక్ష
- 97కు పెరిగిన ఎగ్జామ్ సెంటర్లు
హైదరాబాద్, వెలుగు: వచ్చేనెల 3 నుంచి జరగబోయే టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు శనివారం రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు tgtet.aptonline.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈసారి ఎగ్జామ్ సెంటర్లను 97కు పెంచామన్నారు. ఇందులో ఎక్కువగా హైదరాబాద్ పరిసర జిల్లాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరిలో 24, రంగారెడ్డిలో 21 సెంటర్లు ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధన అమలుచేస్తామని, అభ్యర్థులు కనీసం రెండు గంటలు ముందుగా సెంటర్ వద్దకు చేరుకోవాలని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రంలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని, చేతులకు గోరింటాకు, ఇంక్ మరకలు, టాటూలు లేకుండా చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. కాగా, టెట్ కు చివరగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు తక్కువ సెంటర్లు ఉన్న ప్రాంతాల అభ్యర్థులకు పరీక్షా కేంద్రం చాలా దూరంగా పడ్డాయి. దీంతో ఈ చలికాలంలో వందల కిలోమీటర్లు ప్రయాణించి పరీక్షలు రాయడం ఇబ్బందిగా మారింది.
