ప్రభాస్ హీరోగా మారుతి రూపొందించిన పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’.సంజయ్ దత్ కీలక పాత్ర పోషించగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ..‘ఇది నానమ్మ, మనవడి కథ. జరీనా వాహబ్ గారు నాకు నానమ్మ క్యారెక్టర్ లో నటించారు. డబ్బింగ్ చెబుతుంటే నా సీన్స్ మర్చిపోయి నానమ్మ సీన్స్ చూస్తూ ఉండిపోయా. రిద్ధి, మాళవిక, నిధి ముగ్గురూ బ్యూటిఫుల్ హీరోయిన్స్. ఈ ముగ్గురు తమ పర్ ఫార్మెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటారు. ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ పెరిగింది. అయినా ఎంతో ధైర్యంగా విశ్వప్రసాద్ గారు సినిమా నిర్మించారు.
హారర్ ఫాంటసీ సినిమాకు తమన్ మాత్రమే మ్యూజిక్ చేయగలడు అనిపించింది. మారుతి గారిని ఫస్ట్ కలిసినప్పుడు డార్లింగ్ అన్నీ యాక్షన్ మూవీస్ అవుతున్నాయి, మంచి ఎంటర్ టైనింగ్ మూవీ మన ఫ్యాన్స్ కు ఇవ్వాలి అని అన్నాను. హారర్ కామెడీ జానర్ తో ఈ ప్రాజెక్ట్ రెడీ చేశాం. 15 ఏళ్ల తర్వాత ఎంటర్ టైనర్ తో వస్తున్నా. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి' అని అన్నాడు.
ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ తో నటించడం చాలా సంతోషంగా ఉందని హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహన్ రిద్ది కుమార్ అన్నారు. ఈ చిత్రంతో ప్రభాస్ గారికి జీవితకాలం రుణపడి ఉంటానని దర్శకుడు మారుతి అన్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో బిగ్గెస్ట్ స్టార్ తో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇదని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ అన్నారు. నటులు వీటీవీ గణేష్, సప్తగిరి, మహేష్ ఆచంట, రోహిత్, జరీనా వహాబ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్, నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని పాల్గొన్నారు.
