జైల్లో మంత్రికి రాజభోగాలు.. మరో వీడియో రిలీజ్

జైల్లో మంత్రికి రాజభోగాలు.. మరో వీడియో రిలీజ్

ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ కు సంబంధించిన మరొక వీడియో బయటికొచ్చింది. కొన్ని రోజుల క్రితం సత్యేంద్ర జైన్ తన కాళ్లకు మసాజ్ చేయించుకుంటున్న వీడియోను రిలీజ్ చేసిన తీహార్ జైల్ అధికారులు లేటెస్ట్ గా ఆయన ఆహారం తీసుకుంటున్న మరో వీడియోను రిలీజ్ చేశారు.  జైల్లో సత్యేంద్రజైన్ 8 కిలోల బరువు పెరిగినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. అయితే జైల్లో సత్యేంద్ర జైన్ 28 కిలోల బరువు తగ్గినట్లు అతని లాయర్ చెప్పారు. సత్యేంద్రజైన్ లాయర్ వాదనలకు.. జైలు అధికారులు చెప్పిన దానికి పొంతన లేకపోవటంతో ఈ వీడియోపై మరోసారి వివాదం చెలరేగే అవకాశం ఉంది. 


ఈ వీడియోపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు. సత్యేంద్రజైన్ కు జైల్లో రాచమర్యాదలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సత్యేంద్ర జైన్ కు బయటి నుంచి ఫుడ్ తీసుకొస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఈ వీడియోను  బీజేపీ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు .