మితిమీరుతున్న వాయు కాలుష్యం.. నవంబర్ 10వరకు స్కూళ్లు బంద్

మితిమీరుతున్న వాయు కాలుష్యం.. నవంబర్ 10వరకు స్కూళ్లు బంద్

దీపావళికి కొన్ని రోజుల ముందు, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గాలి నాణ్యత సూచిక తీవ్ర స్థాయికి పడిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఇటీవల దేశ రాజధానిలోని అన్ని ప్రభుత్వ, ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 3, 4 తేదీల్లో మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. తాజాగా, కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నందున, ఢిల్లీ విద్యా మంత్రి ఐతీషి అన్ని ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10 వరకు మూసివేయనున్నట్లు ప్రకటించారు. 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించవచ్చని మంత్రి తెలిపారు.

“కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నందున, ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలు నవంబర్ 10 వరకు మూసివేయబడతాయి. గ్రేడ్ 6-12 కోసం, పాఠశాలలకు ఆన్‌లైన్ తరగతులకు అవకాశం ఇవ్వబడింది”అని మంత్రి మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో పోస్ట్ చేశారు. అంతకుముందు.. పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిల దృష్ట్యా రాజధాని నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలను రాబోయే రెండు రోజులు - గురు, శుక్రవారాలు - మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా, ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలు రాబోయే 2 రోజుల పాటు మూసివేయబడతాయి”అని కేజ్రీవాల్ చెప్పారు. నవంబర్ 3, 4 తేదీల్లో పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ విధానంలో తరగతులు నిర్వహించాలని కోరారు.

ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కొన్ని రోజులుగా గాలి నాణ్యత 'తీవ్రం'గా ఉంది. CPCB డేటా ప్రకారం, ఈ రోజు ఉదయం ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 400-మార్క్ కంటే ఎక్కువగా నమోదైంది. ఇది 'తీవ్రమైన' కేటగిరీ కిందకు వస్తుంది.