దీపావళికి ముందే ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం

దీపావళికి ముందే ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరవాసులను ఎయిర్ పొల్యూషన్ ఆందోళన కలిగిస్తోంది. దీపావళి పండుగకు ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగిందని తెలిపారు అధికారులు. ఎయిర్ క్వాలిటీ తీవ్రంగా పడిపోయిందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ రీసెర్చ్ అధికారులు తెలిపారు. మరో వారం రోజుల్లో వాయు కాలుష్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత 303గా నమోదైంది. ఫరీదాబాద్ 306, ఘజియాబాద్ 334, నోయిడాలో 303గా గాలి నాణ్యతను నమోదయిందని అధికారులు తెలిపారు. దీపావళి రోజు రాత్రికి ఢిల్లీలోని గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. గాలుల స్పీడ్ కూడా తక్కువగా ఉందని.. నవంబర్ 7తర్వాతే గాలుల వేగం పెరిగి ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందన్నారు అధికారులు.