'ఫర్జీ' వెబ్ సిరీస్ స్ఫూర్తితో ఫేక్ కరెన్సీ తయారీ.. ఐదుగురి అరెస్ట్

'ఫర్జీ' వెబ్ సిరీస్ స్ఫూర్తితో ఫేక్ కరెన్సీ తయారీ.. ఐదుగురి అరెస్ట్

ఫేమస్ వెబ్ సిరీస్ 'ఫర్జీ' స్ఫూర్తితో నకిలీ కరెన్సీ అంతర్రాష్ట్ర రాకెట్‌ను నడుపుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ముఠా సభ్యులు అజ్మీర్‌లో నకిలీ కరెన్సీ ప్రింటింగ్ యూనిట్‌ను నడుపుతున్నారని, వాటిని దేశ రాజధాని ప్రాంతంలో చెలామణి చేశారని వారు తెలిపారు. నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్షరధామ్ దేవాలయం సమీపంలో సరుకును పంపిణీ చేస్తారని పక్కా సమాచారం అందడంతో ఢిల్లీ పోలీసులు వారిని అరెస్టు చేశారని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) రవీంద్ర సింగ్ యాదవ్ తెలిపారు.

ముఠా కింగ్‌పిన్ సాకూర్ మహ్మద్ (25), అతని సహాయకుడు లోకేష్ యాదవ్ (28)ని అరెస్టు చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి రూ.500 విలువ గల రూ.6 లక్షలకు సమానమైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హిమాన్షు జైన్ (47), శివ్ లాల్ (30), అతని సోదరుడు సంజయ్ గోదారా (22) నుంచి చలామణి కోసం నకిలీ నోట్లను అందుకున్నట్లు మహ్మద్ పోలీసులకు చెప్పినట్టు విచారణలో తేలింది. తాను రాధే, శివలాల్‌తో కలిసి రాజస్థాన్‌లోని అజ్మీర్‌లోని అద్దె ఇంట్లో ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్లను ప్రింట్ చేయడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు స్పెషల్ సీపీ (క్రైమ్) తెలిపారు.

ఈ తర్వాత ఢిల్లీ పోలీసులు అజ్మీర్‌లో దాడులు నిర్వహించి, జైన్, లాల్, గోదారా అనే మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి నకిలీ నోట్ల ముద్రణకు ఉపయోగించే పరికరాలు, రూ.19లక్షల 74వేల విలువ గల నకిలీ నోట్లు, రెండు కార్లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

వెబ్ సిరీస్ 'ఫర్జీ' ఇన్స్పిరేషన్ తో..

మొహమ్మద్ 2015లో అజ్మీర్‌కు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. అక్కడ వెబ్ సిరీస్ 'ఫర్జీ' నుంచి నకిలీ కరెన్సీ నోట్లను ప్రింట్ చేసి ఎలా సర్క్యులేట్ చేయాలో తెలుసుకున్నాడు. అతని సహచరుడు లాల్ కూడా 2011లో పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం అజ్మీర్ వెళ్లాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎఫ్‌ఐసిఎన్‌ యూనిట్‌ను తెరిపించేందుకు మహ్మద్‌, రాధేతో కలిసి కుట్ర పన్నాడు.