రిపబ్లిక్ డే బెదిరింపుల కేసులో.. ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్నూన్‌‌‌‌‌‌‌‌పై కేసు ఫైల్

రిపబ్లిక్ డే బెదిరింపుల కేసులో.. ఖలిస్తానీ టెర్రరిస్ట్ పన్నూన్‌‌‌‌‌‌‌‌పై కేసు ఫైల్

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఢిల్లీలో అశాంతిని సృష్టిస్తామని బెదిరింపులకు పాల్పడిన సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్​ఎఫ్​జే) నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ పై ఢిల్లీ పోలీసులు శుక్రవారం (జనవరి 23) కేసు నమోదు చేశారు. 

నేరపూరిత కుట్ర, భారతదేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను ప్రమాదంలో పడేసే చర్యలు, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఇతర నేరాలకు సంబంధించిన బీఎన్​ఎస్ సెక్షన్లు 196, 197, 152, 61 కింద ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం ఎఫ్​ఐఆర్ నమోదు చేసింది. 

రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతూ పన్నూన్​ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీయోను రిలీజ్​ చేశాడు. అందులో రోహిణి, దబ్రి వంటి ప్రాంతాలలో తమ స్లీపర్ సెల్స్ ద్వారా ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లు అతికించామని అతడు వీడియోలో పేర్కొన్నాడు. అయితే, పన్నూన్​పేర్కొన్న ప్రదేశాలలో అలాంటి పోస్టర్లు ఏమీ లేవని పోలీసులు తెలిపారు.