దేశ రాజధానిపై ఉగ్రవాదుల కన్ను.. ఢిల్లీలో హై అలర్ట్.. సెక్యూరిటీ పెంపు

దేశ రాజధానిపై ఉగ్రవాదుల కన్ను.. ఢిల్లీలో హై అలర్ట్.. సెక్యూరిటీ పెంపు

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఢిల్లీ వీధుల్లో సెక్యూరిటీని టైట్ చేశారు. పహల్గాం దాడుల తర్వాత టెర్రరిస్టుల దృష్టి రాజధానిపై పడిందనే నిఘావర్గాల సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పహల్గాం మారణ హోమం తర్వాత టెర్రిస్టులు ఇంకా ఇండియాలోనే ఉన్నట్లు ఇప్పటికే సమాచారం వచ్చింది. దీంతో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టాయి భద్రతా బలగాలు. 

ఉగ్రవాదులు ఢిల్లీని టార్గెట్ చేశారన్న వార్తలతో ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాలలో సెక్యూరిటీని భారీగా పెంచారు. ప్రజలు ఎక్కువగా తిరిగే మార్కెట్ ప్రేస్ లతో పాటు చారిత్రక స్థలాలలోనూ సెక్యూరిటీని టైట్ చేశారు. ఇండియా గేట్,  జన్ పఠ్ లతో పాటు ఇతర ఆలయాల వద్ద కూడా బలగాలను మోహరించారు. పబ్లిక్ సేఫ్టీ కోసం లా అండ్ ఆర్డర్ ను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు చర్యలు మొదలు పెట్టారు. 

టెర్రిరిజం తో పరోక్ష సంబంధాలు ఉన్న వారిని విచారిస్తున్నారు. అలాగే ఎలాంటి అలర్ట్ నైనా సీరియస్ గా తీసుకున్నట్లు పోలీసులు అధికారులు చెబుతున్నారు. పోలీసులు వీధుల్లో కాలినడకన పెట్రోలింగ్ చేస్తున్నారు. సాయంత్రం, రాత్రి సమయాల్లో ముఖ్యంగా అనుమానిత ప్రాంతాలలో గస్తీ కాస్తున్నారు. 

ఏప్రిల్ 22న జరిగిన కాల్పుల తర్వాత ఇండియా సీరియస్ యాక్షన్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇరు దేశాలు ఆర్మీ, నేవీ డ్రిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య టెర్రిస్టులు ఇంకా కశ్మీర్ లోనే ఉండటం ఒక రకంగా ఆందోళన కలిగించే అంశమే. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ముష్కరుల కోసం వేటను మరింతగా పెంచినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. 

పహల్గాం దాడికి పాల్పడిన టెర్రరిస్టులను వేటాడి చంపేయండని గురువారం (మే 1) కేంద్ర మంత్రి అమిత్ షా ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ క్రూర దాడికి సమాధానం ఇచ్చి తీరాల్సిందేనని ఉద్ఘాటించారు. ఏప్రిల్ 22న అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం పట్టణంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు చనిపోయారు. బైసరన్ లోయలో చోటుచేసుకున్న ఈ మారణకాండకు బదులు చెప్పాలనే ఇండియా ఇప్పటికే పాక్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. అందులో భాగంగా త్రివిధ దళాలను సరిహద్దులో మోహరించింది.