మేం చెప్పేంత వరకు స్కూళ్లు తెరవొద్దు

మేం చెప్పేంత వరకు స్కూళ్లు తెరవొద్దు
  • విద్యా సంస్థలకు కేజ్రీవాల్ సర్కార్ ఆదేశాలు 

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 352గా నమోదైంది. మరోవైపు కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అత్యవసర సేవలు మినహా.. ట్రక్కుల రాకపోకలపై నిషేధం విధించింది. ప్రభుత్వ ఆఫీసుల్లో వర్క్ ఫ్రం హోం ఈనెల 26 వరకు పొడిగించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలు మూసివేయాలని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. కాలుష్యానికి తోడు పొగమంచు ఢిల్లీ వాసులను తీవ్ర ఇబ్బంది పెడుతోంది. దీంతో తెల్లవారుజామున వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.