
పద్మారావునగర్, వెలుగు: స్టూడెంట్స్‌లో వెళ్తున్న స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు లేచాయి. ఈ ఘటన కంటోన్మెంట్ లో జరిగింది. గురువారం ఉదయం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు స్టూడెంట్స్‌తో ఏవోసీ రోడ్డులో వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు ఇంజిన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపేశాడు. అక్కడే ఉన్న ఆర్మీ సిబ్బంది పిల్లలను బస్సులో నుంచి దింపేశారు. ఫైర్ ఇంజిన్ సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదంతో కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి.