సీఏఏ అల్ల‌ర్ల కేసులో జామియా కోఆర్డినేష‌న్ క‌మిటీ స‌భ్యుడి అరెస్టు

సీఏఏ అల్ల‌ర్ల కేసులో జామియా కోఆర్డినేష‌న్ క‌మిటీ స‌భ్యుడి అరెస్టు

ఈశాన్య ఢిల్లీలో ఫిబ్ర‌వ‌రి చివ‌రిలో జ‌రిగిన సీఏఏ అల్ల‌ర్లకు సంబంధం ఉంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై జామియా కోఆర్డినేష‌న్ క‌మిటీ మీడియా కోఆర్డినేట‌ర్ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (సీఏఏ)కి వ్య‌తిరేకంగా ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్ ఏరియాలో భారీ సంఖ్య‌లో నిర‌స‌నకారుల‌తో ఆందోళ‌న‌లు చేప‌ట్టిన స‌ఫూరా జ‌ర్గ‌ర్ ను శ‌నివారం అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు జాయింట్ క‌మిష‌న‌ర్ అలోక్ కుమార్. స‌ఫూరా నిర‌స‌న‌ల త‌ర్వాత జ‌ఫ్రాబాద్ మెట్రో స్టేష‌న్ స‌మీపంలోనే ఫిబ్ర‌వ‌రి చివ‌రిలో అల్ల‌ర్లు చెల‌రేగాయి. ఈ ప్రాంతంలో మొద‌లైన హింస ఢిల్లీలో అనేక ప్రాంతాల‌కు విస్త‌రించి.. ఇద్ద‌రు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల‌తో పాటు 53 మంది ప్రాణాలు కోల్పోయారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా స‌ఫూరా జ‌ర్గ‌ర్ ఈ అల్ల‌ర్ల‌లో దాడుల‌కు పాల్ప‌డిన్న‌ట్లు గుర్తించి అరెస్టు చేసిన‌ట్లు పోలీసుల ద్వారా స‌మాచారం అందుతోంది. జామియా ఇస్తామియా యూనివ‌ర్సిటీ విద్యార్థి మీరాన్ హైద‌ర్ (35).. ఈ అల్ల‌ర్ల‌కు కుట్ర ప‌న్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఏప్రిల్ 2న అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. ఏప్రిల్ 6న అత‌డి పోలీస్ క‌స్ట‌డీ ముగియ‌డంతో ఢిల్లీ కోర్టు మ‌రో తొమ్మిది రోజులు పొడిగించింది.