ఆగస్టు15ను ‘రిపబ్లిక్‌ డే’గా రాశారు..కోర్టులో పిటిషన్

ఆగస్టు15ను ‘రిపబ్లిక్‌ డే’గా రాశారు..కోర్టులో పిటిషన్

ఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సెలబ్రేషన్స్ కోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసు విభాగంలోనూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ..తప్పిదం చేసింది ఢిల్లీ పోలీసు విభాగం. ఈ ఆగస్టు 15కు సంబంధించి కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన సౌత్ ఢిల్లీ పోలీసు విభాగం, అందులో ‘ఇండిపెండెన్స్‌ డే’కు బదులుగా ‘రిపబ్లిక్‌ డే’ అని తప్పుగా ప్రచురించింది.

దీంతో మన్‌ జీత్‌ సింగ్‌ చుఘ్‌ అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. కింది స్థాయి సిబ్బంది చేసిన తప్పు నోటిఫికేషన్లను.. పై అధికారులు పరిశీలించి ఆమోదించలేదని పిటిషన్‌ లో తెలిపాడు. అయితే ఈ పిటిషన్‌ బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది.