
హైదరాబాద్, వెలుగు: రంజీ ట్రోఫీని హైదరాబాద్ నిరాశతో ప్రారంభించింది. ఢిల్లీతో శనివారం ముగిసిన గ్రూప్–డి మ్యాచ్‌ను డ్రా చేసుకున్న ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకోలేక ఒకే పాయింట్‌తో సరిపెట్టుకుంది. ఢిల్లీకి మూడు పాయింట్లు లభించాయి. 400/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 112.2 ఓవర్లలో 411 రన్స్‌కు ఆలౌటైంది.
రాహుల్ రాధేశ్ (46) మోస్తరుగా ఆడినా టెయిలెండర్లు ఫెయిలయ్యారు. 11 రన్స్ తేడాతో రాహుల్, చామ మిలింద్ (1), సరను నిశాంత్ (2) ఔటయ్యారు. ఆయుష్ బదోనీ 6, అర్పిత్ రాణా 3 వికెట్లు తీశారు. 118 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ మ్యాచ్ చివరకు 42 ఓవర్లలో 138/3 స్కోరు చేసింది. సనత్ సంగ్వాన్ (56), యష్ ధుల్ (53) హాఫ్ సెంచరీలు సాధించారు. మ్యాచ్ మొత్తంలో 267 రన్స్ చేసిన సనత్ సంగ్వాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది