ప్రొఫెసర్ సాయిబాబా విడుదలపై సుప్రీం కోర్టు స్టే

ప్రొఫెసర్ సాయిబాబా విడుదలపై సుప్రీం కోర్టు స్టే
  • కేసు తదుపరి విచారణ డిసెంబర్ 8కి వాయిదా  

న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్   సాయిబాబాకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  సాయిబాబాతో పాటు ఐదుగురిని నిర్దోషులని.. జైలు నుంచి విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. ప్రొఫెసర్ సాయిబాబా వైక్యాలన్ని దృష్టిలో ఉంచుకునైనా గృహ నిర్బంధంలో ఉంచాలని ఆయన తరపు న్యాయవాది బసంత్  విజ్ఞప్తి చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది.

సాయిబాబా నిర్దోషి అంటూ శుక్రవారం బాంబే హైకోర్టు  ఇచ్చిన తీర్పుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). మహా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ అప్పీల్ పై  విచారణ జరిపిన సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. అంతేగాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై నాలుగు వారాల్లోగా సమాధానం తెలియజేయాలంటూ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు ఇతర నిందితులకు నోటీసులు జారీ చేసింది.  కేసు తదుపరి విచారణను డిసెంబరు 8 వ తేదీకి వాయిదా వేసింది.