
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. మార్చి 17తో సిసోడియా కస్టడీ ముగియనుండటంతో మనీస్ సిసోడియాను కోర్టులో ప్రవేశ పెట్టారు ఈడీ అధికారులు. సిసోడియా కస్టడీని మరో ఏడు రోజులు పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. సిసోడియా ఈ మెయిల్ డాటా, సెల్ ఫోన్ పరిశీలించాల్సి ఉందని కోర్టుకు చెప్పింది. రిమాండ్ పొడిగింపు కోసం ED చేసిన అభ్యర్థనను సిసోడియా తరపు న్యాయవాది వ్యతిరేకించారు. అయితే ఇరువురి వాదనలు విన్న ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు సిసోడియా కస్టడీని మరో ఐదు రోజుల పాటు పొడిగించింది.
అలాగే మనీష్ సిసోడియా తన కుటుంబ ఖర్చులు, అతని భార్య వైద్య ఖర్చులు రూ. 40,000, రూ. 45,000 చెక్కులపై సంతకం చేయడానికి కోర్టు అనుమతినిచ్చింది.