ఢిల్లీలో డేంజర్ బెల్స్.. ప్రమాదకరంగా గాలి కాలుష్యం

ఢిల్లీలో డేంజర్ బెల్స్.. ప్రమాదకరంగా గాలి కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది.  దీపావళికి టపాసులు నిషేదించినా  కొన్ని చోట్ల కాల్చడంతో కాలుష్యం మరింత పెరిగింది. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయిందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ రీసెర్చ్ అధికారులు తెలిపారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం ఢిల్లీ యూనివర్సిటీ, పీయూఎస్‌ఏ, లోధి రోడ్, మధుర రోడ్, ఐఐటీ ఢిల్లీ, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో గాలి నాణ్యత   387గా నమోదైంది.  ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ అనేది.. 0 నుంచి 5 మధ్య నమోదైతే గాలి నాణ్యత మంచి స్థాయిలో ఉన్నట్టు.  201 దాటితో పూర్, 301 దాటితే వెరీ పూర్, 401 దాటితే తీవ్రంగా ఉన్నట్లుగా పరిగణిస్తారు.

CPCB డేటా 24-గంటల సగటు AQI గురువారం రాత్రి 9 గంటలకు  తీవ్రమైంది. పొగమంచు రాజధానిని చుట్టుముట్టడంతో ప్రతి గంటకు క్రమంగా పెరుగుతోంది. AQI(ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ ) గురువారం రాత్రి 9 గంటలకు 404, అర్ధరాత్రికి సగటున 422, 2 గంటలకు 428, ఉదయం 6 గంటలకు 444, ఉదయం 7 గంటలకు 446 మరియు శుక్రవారం ఉదయం 8 గంటలకు 451కి పెరిగింది.