ఢిల్లీలో మరోసారి పెరిగిన ఎయిర్ పొల్యూషన్

ఢిల్లీలో మరోసారి పెరిగిన ఎయిర్ పొల్యూషన్

ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ మరోసారి పెరిగింది. పూర్ కేటగిరి నుంచి వెరీ పూర్ కేటగిరికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 354కు చేరింది. దీంతో గాలిలో నాణ్యత తగ్గింది. దీపావళి తరువాత నుంచి ఎయిర్ క్వాలిటి  తగ్గిందని అధికారులు చెబుతున్నారు. సోమవారం రాత్రి AQI 312 ఉండగా మంగళవారానికి 302కి చేరి మెరుగు పడింది. అయితే నిన్న మరోసారి ఎయిర్ పొల్యూషన్ పెరిగింది. పొల్యూషన్ కారకాలు వాతావరణంలో పెరిగి పోయాయని వాతావరణ శాఖ అధికారులు అన్నారు.

 లోకల్ లోనే ఎక్కువ పోల్యూషన్ అవుతుందని అధికారులు వెల్లడించారు. పంజాబ్, హర్యానాలో జరిగిన ఫైర్స్ వల్ల కూడా పొల్యూషన్ పెరిగిందన్నారు. రెండు రాష్ట్రాల్లో గత రెండు రోజుల నుంచి 12వందలకు పైగా అగ్ని ప్రమాదాలు జరిగాయన్నారు. రానున్న రోజుల్లో పొల్యూషన్ తగ్గే అవకాశం ఉందన్న అధికారులు.... ప్రస్తుతం వెరీ పూర్ కేటగిరిలో ఉండగా మరో ఆరు రోజుల్లో పూర్ కేటగిరిలోకి చేరే చాన్స్ ఉందని చెప్పారు.