
జీడిమెట్ల, వెలుగు: ఓ డెలివరీ బాయ్‌పై ఆకతాయిలు దాడి చేసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవమ్మబస్తీకి చెందిన శ్రీకాంత్డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 10 గంటలకు పని ముగించుకొని బైక్‌పై ఐడీపీఎల్నుంచి ఇంటికి వెళ్తున్నాడు.
పాపిరెడ్డినగర్వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని అడ్డగించి, దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గంజాయి బ్యాచ్పని కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.