
చొరవ చూపిన 108 సిబ్బంది
వేములవాడ, వెలుగు: కరోనా పాజిటివ్ పేషెంట్‌కు 108 అంబులెన్స్ సిబ్బంది ఇంట్లోనే డెలివరీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ కాలనీకి చెందిన గర్భిణీకి డెలివరీ టైం దగ్గరికి వచ్చేసరికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో డాక్టర్లు హైదరాబాద్ తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. వెంటనే అక్కడికి 108 చేరుకుంది. గర్భిణికి అప్పటికే నొప్పులు ఎక్కువయ్యాయి. మెడికల్ టెక్నీషియన్ స్వాతి ఎలాంటి ఆందోళన చెందకుండా ఇంట్లోనే డెలివరీ చేశారు. తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. అనంతరం వారిని 108 సిబ్బంది ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.