స్టార్టప్‌‌కు ఫండింగ్ అందకపోవడం మంచిదే

స్టార్టప్‌‌కు ఫండింగ్ అందకపోవడం మంచిదే
  •     అతిగా ఖర్చు చేయకూడదని తెలుసుకున్నాయి : డెలాయిట్

న్యూఢిల్లీ : స్టార్టప్‌‌లకు ఫండింగ్‌ దొరకకపోవడం కూడా ఒక విధంగా వీటికి మేలు చేసిందని డెలాయిట్‌‌ పేర్కొంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఫండ్స్ సేకరించడానికి  స్టార్టప్‌‌ కంపెనీలు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. ఈ పీరియడ్‌‌ను ఫండింగ్ వింటర్‌‌‌‌గా పేర్కొన్నారు. ‘ఫండ్స్‌‌ సరిగ్గా అందకపోవడంతో   స్టార్టప్‌లు అతిగా ఖర్చు పెట్టలేదు’ అని డెలాయిట్ ఇండియా పార్టనర్‌‌‌‌ పీయూష్‌‌ వైష్‌‌ వెల్లడించారు. కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాయన్నారు.  కానీ, ఇండియాలోకి వచ్చే ఫండ్స్‌‌పై స్టార్టప్‌‌లు నమ్మకంగా ఉన్నాయని

వచ్చే ఏడాది మొదటి రెండు క్వార్టర్ల నుంచి  ఇన్‌‌ఫ్లోస్ కొనసాగుతాయని పేర్కొన్నారు. వాల్యుయేషన్స్ పెరిగే కొద్దీ స్టార్టప్‌‌లు భారీగా ఖర్చులు చేశాయని వెల్లడించారు. ‘ ఉన్న డబ్బులు ఖర్చు చేసేసి, ఫండింగ్‌‌పైన ఆధారపడడం  అప్పుడు కరెక్ట్ అనిపించిందేమో.  కొన్ని స్టార్టప్‌‌లు అయితే ఒక్కసారిగా మెరిశాయి. కానీ, ప్రస్తుతం స్టార్టప్‌‌లు చాలా గుణపాఠాలు నేర్చుకున్నాయి. అతిగా ఖర్చు చేయకుండా లాభాల్లోకి ఎలా రావాలో తెలుసుకున్నాయి’ అని వైష్‌‌ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు స్టార్టప్‌‌లు ఏడాదికి మంచి గ్రోత్ నమోదు చేస్తున్నాయని

లాభాలు పెంచుకుంటున్నాయని, లాస్‌‌లు తగ్గించుకుంటున్నాయని, తక్కువగా ఖర్చు చేస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని సెగ్మెంట్లలో చేతులు పెట్టకుండా కీలకమైన కొన్ని బిజినెస్‌‌లపై ఫోకస్ పెట్టాయని చెప్పారు. ఫండింగ్ వింటర్‌‌‌‌ అనేది లాభాల్లో లేని, భారీ వాల్యుయేషన్‌‌ స్టార్టప్‌‌లకు  కరెక్షన్ ఫేజ్‌‌ వంటిదని 35 నార్త్‌‌ వెంచర్స్‌‌ ఎండీ మిలన్‌‌ శర్మ అన్నారు. తక్కువగా ఖర్చులు చేసిన కంపెనీలు ఈ స్టేజ్‌‌ను జాగ్రత్తగా దాటగలిగాయని చెప్పారు.

ఫైనాన్షియల్స్ బాగున్న, స్ట్రాంగ్ బిజినెస్ మోడల్‌‌ ఉన్న స్టార్టప్‌‌లలో  ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ఫోకస్ పెడుతున్నారని ఇంక్యుబేట్ ఫండ్ పార్టనర్‌‌‌‌ రాజీవ్ రంక అన్నారు. కిందటేడాది స్టార్టప్‌‌లు 40 బిలియన్ డాలర్లు ఆకర్షించగా, ఈ ఏడాది 9 నెలల్లో ఇందులో 30–35 %  మాత్రమే ఆకర్షించగలిగాయి.