అలర్ట్‌గా లేకుంటే డెల్టా వేరియంట్‌‌తో ముప్పే

అలర్ట్‌గా లేకుంటే డెల్టా వేరియంట్‌‌తో ముప్పే

జెనీవా: డెల్టా వేరియంట్‌తో భారీ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపించిందని తెలిపింది. వేగంగా వ్యాప్తి చెందే ఈ వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండకపోతే భారీ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. రాబోయే కొద్ది నెలల్లో ఈ వేరియంట్ వల్ల కరోనా కేసుల సంఖ్య తీవ్రమవుతుందని చెప్పింది. ‘వరల్డ్ వైడ్‌గా 96కు పైగా దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఆయా దేశాల్లో కరోనా ఇన్ఫెక్షన్ రేటు పెరుగుతోంది. ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి వేరియంట్‌లు ఎంతవరకు ప్రమాదమో తెలుసుకోవడానికి వీటి సీక్వెన్సింగ్ కెపాసిటీని గుర్తించాల్సి ఉంది. అయితే ఇతర వేరియంట్‌లతో పోలిస్తే డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకారి అనే చెప్పాలి. దీన్ని ఎదుర్కోవాలంటే వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాల్సిందే’ అని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియోస్ స్పష్టం చేశారు.