కరోనా టైమ్​లోనూ.. స్మార్ట్‌ ఫోన్ల హవా

కరోనా టైమ్​లోనూ.. స్మార్ట్‌ ఫోన్ల హవా

న్యూఢిల్లీ: ఇండియా స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్ 2020లో కేవలం 4 శాతమే తగ్గింది. చివరి ఆరు నెలల కాలంలో వచ్చిన అత్యధిక డిమాండ్ స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్‌‌ను భారీగా పడకుండా కాపాడింది. 2020లో 15 కోట్ల ఫోన్లు షిప్‌‌మెంట్ జరిగినట్టు కౌంటర్‌‌‌‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో చైనాకు చెందిన షియోమినే మన స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్‌‌లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. 26 శాతం మార్కెట్ షేరుతో షియోమి తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత శాంసంగ్ 20 శాతం మార్కెట్ షేరును, వివో 15 శాతం మార్కెట్ షేరును, రియల్‌‌మీ 11 శాతం, ఒప్పో 10 శాతం షేరును పొందాయి. దీపావళి సీజన్‌‌లో అంటే నవంబర్ మధ్య కాలంలో, అక్టోబర్‌‌‌‌ నెల అంతా స్మార్ట్‌‌ఫోన్ షిప్‌‌మెంట్లు బాగా జరిగినట్టు సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రచిర్ సింగ్ తెలిపారు. మూడో క్వార్టర్‌‌‌‌లో రికార్డు బ్రేకింగ్ సేల్స్ నమోదు చేశాక.. నాలుగో క్వార్టర్‌‌‌‌లో కూడా ఇండియన్ స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్ ఇదే మూమెంటంను కొనసాగించినట్టు చెప్పారు. ఈ మూమెంటం ఇలానే కొనసాగుతుందని, చాలా మంది ప్రజలు ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌‌ఫోన్లలోకి మారుతున్నారని తెలిపారు. మరోవైపు స్మార్ట్‌‌ఫోన్ రేట్లు కూడా అఫర్డబుల్‌‌గా దొరుకుతుండటం ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాయి.

టాప్ 5 బ్రాండ్లతో పాటు యాపిల్, వన్‌‌ప్లస్, పోకో, మైక్రోమ్యాక్స్ కంపెనీలు కూడా బెస్ట్ ఎవర్ క్వార్టర్స్‌‌ను రికార్డు చేశాయి. పాత ఐఫోన్ మోడల్స్‌‌తోనే యాపిల్ ఇండియాలో వ్యాపారాలను రెండింతలు పెంచుకుంది. ఐఫోన్ ఎస్‌‌ఈ 2020, ఐఫోన్ 11, ఐఫోన్ ఎక్స్‌‌ఆర్‌‌‌‌ లు బాగా అమ్ముడుపోయినట్టు ఇండస్ట్రి అనలిస్ట్‌‌లు చెప్పారు. ‘కొన్ని మార్కెట్లలో మా షేరు చాలా తక్కువగా ఉంది. దీనిలో ఇండియా ఒకటి. కానీ కిందటేడాది క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే మాత్రం కంపెనీ షేరు మెరుగుపడింది. మా వ్యాపారాలు సుమారు రెండింతలు పెరిగాయి’ అని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ చెప్పారు. యాపిల్ మార్కెట్ షేరు 2019 డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో 2 శాతం ఉంటే.. 2020 డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో 4 శాతానికి పెరిగిందని ఎక్స్‌‌పర్ట్స్ తెలిపారు. దీనిలో 50 శాతం సేల్స్ పాత ఐఫోన్లవేనని ప్రచీర్ సింగ్ చెప్పారు. మొత్తం కంపెనీ షిప్‌‌మెంట్లలో 30 శాతం ఐఫోన్ ఎస్‌‌ఈవి కాగా.. ఐఫోన్ 11 షిప్‌‌మెంట్లు 27 శాతం, ఐఫోన్ ఎక్స్‌‌ఆర్ షిప్‌‌మెంట్లు 14 శాతం ఉన్నాయి. మిగిలిన షిప్‌‌మెంట్లు ఐఫోన్ 12 సిరీస్‌‌వి అని చెప్పారు.

చైనీస్ బ్రాండ్లే 75 శాతం మార్కెట్ షేరు..

ఈ ఏడాది మధ్యలో నెలకొన్న యాంటీ-చైనా సెంటిమెంట్లు ఏడాది చివరి నాటికి కాస్త తగ్గాయి. దీంతో 2020లో చైనీస్ బ్రాండ్స్ 75 శాతం మార్కెట్ షేరును దక్కించుకున్నాయని కౌంటర్‌‌‌‌‌‌‌‌పాయింట్ రీసెర్చ్ అనలిస్ట్ శిల్పి జైన్ చెప్పారు. ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌లో బాగా విస్తరించి ఉన్న బ్రాండ్లు శాంసంగ్, ఒప్పో, వివోలు తమ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఉనికిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. యంగెస్ట్ బ్రాండ్ రియల్‌‌‌‌మీ 2020లో 22 శాతం పెరిగి 2 కోట్ల యూనిట్ల అమ్మకాలను క్రాస్ చేసింది. ఈ బ్రాండ్ బడ్జెట్ సెగ్మెంట్‌‌‌‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అంతేకాక టైర్ 3, 4 నగరాల నుంచి డిమాండ్ పెరగడంతో తన ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌ రీచ్‌‌‌‌ను పెంచుతోంది. అదేవిధంగా కన్జూమర్ ఐఓటీ సెగ్మెంట్‌‌‌‌పైనా ఫోకస్ చేస్తోంది. పోకో 2020 క్యూ4లో తొలిసారి 25 లక్షల స్మార్ట్‌‌‌‌ఫోన్లను విక్రయించింది. వన్‌‌‌‌ప్లస్ క్యూ4లో 200 శాతం గ్రోత్‌‌‌‌ను రికార్డు చేసింది. ఈ ఏడాది తొలిసారి 30 లక్షల షిప్‌‌‌‌మెంట్లను రికార్డు చేసింది. మార్కెట్‌‌‌‌లోకి రీఎంటరైన ఇండియన్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ కూడా ఈ ఆరో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో హయ్యస్ట్ మార్కెట్ షేరును పొందింది. 2020లో ఇండియాలో 5జీ స్మార్ట్‌‌‌‌ఫోన్ షిప్‌‌‌‌మెంట్లు 40 లక్షల యూనిట్లను తాకాయి. ఇక మున్ముందు 5జీ స్మార్ట్‌‌‌‌ఫోన్ షిప్‌‌‌‌మెంట్లు తొమ్మిదింతలు పెరిగి 3.8 కోట్లకు చేరుకుంటాయని కౌంటర్‌‌‌‌‌‌‌‌పాయింట్ అంచనావేస్తోంది.