రేపటి నుంచి ఏఎన్ఎంల సమ్మె.. రెగ్యులరైజ్​ చేయాలని డిమాండ్​

రేపటి నుంచి  ఏఎన్ఎంల సమ్మె.. రెగ్యులరైజ్​ చేయాలని డిమాండ్​

హైదరాబాద్​, వెలుగు: ఏఎన్ఎంలందరినీ రెగ్యులరైజ్​చేయాలని తెలంగాణ యునైటెడ్​ మెడికల్ అండ్​ హెల్త్​ ఎంప్లాయీస్​ యూ నియన్​ రాష్ట్ర కమిటీ డిమాండ్​ చేసింది. సె కండ్​ ఏఎన్​ఎం, ఈసీ ఏఎన్​ఎం, అర్బన్​ హెల్త్​సెంటర్ ఏఎన్​ఎం, వైద్య విధాన పరిషత్​ ఏ ఎన్ఎం, హెచ్ఆర్డీ ఏఎన్ఎంల సహా అందరినీ రెగ్యులరైజ్​ చేయాల్సిందేనని కమిటీ తేల్చి చె ప్పింది. 

ఆ డిమాండ్​తోనే మంగళవారం నుంచి ఏఎన్ఎంలు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. ఆదివారం హైదరాబాద్​లోని యూనియన్​ రాష్ట్ర కమిటీ ఆఫీసులో కాంట్రాక్ట్​ ఏఎన్ఎంల  రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. 

కాంట్రాక్ట్​ ఏఎన్​ఎంలకు రాత పరీక్ష విధానం రద్దు, పనిచేస్తున్నోళ్లను రెగ్యులరైజ్​చేయడంతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని గత నెల 31నే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చామని కమిటీ నేతలు తెలిపారు.