ప్రభుత్వరంగ సంస్థలను ఆర్ఎస్‌ఎస్ నాశనం చేస్తోంది

ప్రభుత్వరంగ సంస్థలను ఆర్ఎస్‌ఎస్ నాశనం చేస్తోంది

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నాశనం చేస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత మాజీ ఆర్థిక సలహాదారు, ప్రొఫెసర్ కౌశిక్ బసుతో జరిగిన మాటామంతీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాహుల్ విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థల విషయంలో కాంగ్రెస్ ఏనాడూ ఎక్కువగా జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. తమ సిద్ధాంతాలు ఇందుకు విరుద్ధమన్నారు. బీజేపీని తాము ఓడించినా, ప్రభుత్వరంగ సంస్థల్లోని ఆ పార్టీ వ్యక్తుల జోలికి వెళ్లబోమన్నారు. కాగా, దేశ చరిత్రలో చీకటి రోజులుగా చెప్పుకునే ఎమర్జెన్సీ పైనా రాహుల్ స్పందించారు. ఎమర్జెన్సీ విధించడం తమ పార్టీ తప్పిదమేనని ఒప్పుకున్నారు.