కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్బీ కాలనీలో రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ విభాగ అధికారులు బుధవారం కూల్చివేశారు. తమకు కొంత సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా తొలగింపు కార్యక్రమాన్ని కొనసాగించారని ఆక్రమణదారులు ఆరోపిస్తున్నారు.
కాలనీ మొదటి రోడ్డు నుంచి జేఎన్టీయూ రోడ్డుకు ఈ దారి ప్రధాన లింక్ గా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి. గతంలో పలుమార్లు ఆక్రమణదారులకు అధికారులు హెచ్చరికలు చేసినా పట్టించుకోకపోవడంతో బుధవారం నేరుగా చర్యలకు ఉపక్రమించారు. ఈ నిర్ణయం ట్రాఫిక్ రద్దీ తగ్గించి, పాదచారులకు మార్గం సులభం చేస్తుందని అధికారులు తెలిపారు.
