యాదాద్రిలో వైకుంఠ ద్వారం కూల్చివేత

యాదాద్రిలో వైకుంఠ ద్వారం కూల్చివేత

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొండపైకి మెట్ల మార్గం మొదలయ్యే ప్రాంతంలో ఉన్న దశాబ్దాల చరిత్ర కలిగిన వైకుంఠ ద్వారాన్ని నిన్న(శుక్రవారం) రాత్రి అధికారులు కూల్చివేశారు. ఈ వైకుంఠ ద్వారాన్ని 1947లో నిర్మించారు. రామ్ దయాళ్‌ సీతారామయ్య శాస్త్రి, నరసింహారెడ్డి, కొండల్‌రెడ్డి, గాదె కిష్టయ్య తదితరులు ఆస్థాన కమిటీగా ఏర్పడి ఈ ద్వారాన్ని నిర్మించారు.

ఇప్పుడు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఈ వైకుంఠ ద్వారాన్ని తొలగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే ద్వారం కూల్చివేతను ముందే నిర్ణయించడంతో దీనికి వెనక ఇప్పటికే మరో వైకుంఠ ద్వారాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులు కూడా దాదాపు పూర్తి అయ్యే దశకు వచ్చాయి.