ఉక్రెయిన్లో దాడులపై రష్యాలో తీవ్ర వ్యతిరేకత

ఉక్రెయిన్లో దాడులపై రష్యాలో తీవ్ర వ్యతిరేకత

ఉక్రెయిన్పై దాడులకు పాల్పడుతున్న పుతిన్పై రష్యాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పుతిన్ చర్యలపై జనం మండిపడుతున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన జనం.. నో టు వార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యుద్ధానికి తాము వ్యతిరేకమని, నో టు వార్ అని రాసిన ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఉక్రెయిన్పై యుద్ధం చేయాలన్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకుని సైన్యాన్ని వెనక్కి రప్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. రష్యాలోని 59 పట్టణాల్లో దాదాపు 17 వందల మందికిపైగా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్క మాస్కోలోనే 900 మందిని అరెస్ట్ చేశారు. 

ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా ఆ దేశంలోని రష్యన్లు ఆందోళన చేప్టటారు. రష్యన్ ఎంబసీ ఎదుట నిరసనకు దిగారు. ఉక్రెయిన్కు మద్దతుగా వందలాదిగా తరలివచ్చిన రష్యన్లు.. పుతిన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ పాస్ పోర్టులను కాల్చి నిరసన తెలిపారు.

ఉక్రెయిన్లో రష్యా దాడులపై అటు అమెరికాలోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా వైఖరిని నిరసిస్తూ ఉక్రెయిన్ ప్రజలు, అమెరికన్లు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రష్యన్ ఎంబసీ ఎదుట నిరసన ప్రదర్శనలు చేశారు. అనంతరం వైట్ హౌస్ వద్దకు చేరుకున్న ఆందోళనకారులు ప్రెసిడెంట్ జో బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ను అడ్డుకోవాలంటూ నినాదాలు చేశారు. యుద్ధం ఆపాలని, ఉక్రెయిన్ను రక్షించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. 

For more news..

ఇండోనేషియాలో భారీ భూకంపం

భార‌త్ లో త‌గ్గుతున్న క‌రోనా కేసులు