జనగామ జిల్లాలో 40 డెంగ్యూ కేసులు

జనగామ జిల్లాలో 40 డెంగ్యూ కేసులు
  • డోర్​టు డోర్​ సర్వే చేస్తున్న వైద్యాధికారులు

జనగామ, వెలుగు: జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి.  జూన్ ​నుంచి ఇప్పటివరకు 40 కేసులు నమోదయ్యాయి. జ్వరపీడితులు ప్రభుత్వ, ప్రైవేట్​హాస్పిటల్స్​కు క్యూ కడుతున్నారు. దీంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. గానుగు పహాడ్​లో గత నాలుగైదు రోజుల్లో 7 డెంగ్యూ కేసులు నమోదవడంతో డీఎంహెచ్ వో మల్లికార్జున్​రావు గురువారం ఆ గ్రామంలో పర్యటించారు. 

డెంగ్యూ పాజిటివ్​ వచ్చినవారి ఇండ్లకు వెళ్లి, వివరాలు సేకరించారు. వైద్య సిబ్బందితో కలిసి డోర్​టు డోర్​ సర్వేలో పాల్గొన్నారు. జ్వరంతో బాధ పడుతున్న పలువురితో మాట్లాడి, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కొబ్బరి చిప్పలు, టైర్లు, ఇంటి ఆవరణలోని గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు.