
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో డెంగ్యూ కలకలం రేపుతోంది. పాల్వంచ మండలం భవానీపేటలో 10 రోజుల్లో 8 మందికి డెంగ్యూ నిర్ధారణ అయింది. ఇందులో నలుగురు కొలుకోగా, మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓ మహిళకు ప్లేట్లెట్లు తగ్గడంతో ఆందోళన చెందుతున్నారు.
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భవానీపేట పరిధిలోని కిసాన్‌నగర్ కాలనీలో ప్రతి ఇంటిలో జ్వరాలతో మంచం పట్టారు. గ్రామంలో వైద్యాధికారులు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి, టెస్టులు చేస్తున్నారు. జ్వర బాధితుల వివరాలను సేకరిస్తున్నారు.