హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇన్ స్పైర్ అవార్డుల కోసం హైదరాబాద్జిల్లాలోని అన్ని స్కూళ్లు అప్లయ్ చేసుకోవాలని డీఈఓ ఆర్.రోహిణి సూచించారు. అప్లికేషన్ల గడువును అక్టోబర్ 15 వరకు గడువు పొడిగించినట్ల స్పష్టం చేశారు. స్టూడెంట్లలోని క్రియేటివిటీని వెలికితీసేందుకు ప్రభుత్వం ‘ఇన్ స్పైర్ అవార్డులు’ ఇస్తోందని, అన్ని స్కూల్మేనేజ్మెంట్స్తప్పనిసరిగా ఐదు ప్రాజెక్టులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
6 నుంచి 10వ తరగతి స్టూడెంట్లు అర్హులని చెప్పారు. inspireawards-dst.gov.in ద్వారా లేదా ఇన్ స్పైర్ మానక్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను పెంచడానికి జిల్లాలోని అన్ని జోన్ల డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, హెచ్ఎంలు, గైడ్ టీచర్లు కృషి చేయాలని ఆదేశించారు. సందేహలు ఉంటే జిల్లా సైన్స్ ఆఫీసర్ సి.ధర్మేంధర్ రావును 77991 71277
సంప్రదించాలని డీఈఓ సూచించారు.