గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై అబ్కారీ శాఖ ఫోకస్

 గంజాయి, మత్తు పదార్థాల రవాణాపై అబ్కారీ శాఖ ఫోకస్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి అమ్మకాలు, తీసుకోవడంపై అబ్కారీ శాఖ రూల్స్ మరింత స్ట్రిక్ట్ చేసింది. అధికారులు గతంలో లేని విధంగా ఇంకా కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం వందల మందిని బైండోవర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. బాండ్‌‌‌‌‌‌‌‌పేపర్‌‌‌‌‌‌‌‌ పూచీకత్తు కాలపరిమితిని ఏడాది నుంచి రెండేండ్లకు పెంచారు. ఫైన్ కూడా ఇప్పుడున్న లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలకు పెంచారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయి గురించి తెలిసీ సమాచారం చెప్పకపోయినా కేసులు నమోదు చేస్తున్నారు. శాటిలైట్​ఫొటోల ద్వారా గంజాయి సాగు వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు.
పెరుగుతున్న బైండోవర్లు

ఇటీవల డ్రగ్స్, గంజాయికి సంబంధించి ఎక్కువ బైండోవర్లు జరుగుతున్నాయి. ఎవరిపై నమోదు చేస్తారో వారు బాండ్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌పై లిఖిత పూర్వకంగా తమ వల్ల ఎలాంటి నేరపూరిత చర్యలు జరగవని పేర్కొంటూ సంతకాలు చేసి ఇవ్వాలి. క్రిమినల్‌‌‌‌‌‌‌‌ ప్రొసీజర్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ 107, 108, 109, 110 సెక్షన్‌‌‌‌‌‌‌‌ల కింద దీన్ని నమోదు చేస్తారు. ఇలా బాండ్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌పై రాసిచ్చిన వారి నుంచి వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని విడుదల చేస్తారు. ఇప్పటి వరకు పూచీకత్తు లక్ష రూపాయల వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు రెండు లక్షల రూపాయలకు పెంచారు. బైండోవర్‌‌‌‌‌‌‌‌ కాలపరిమితి కూడా ఏడాది నుంచి రెండేండ్లకు పెంచారు. ఈ టైంలో క్రైం మళ్లీ రిపీట్‌‌‌‌‌‌‌‌ చేస్తే పూచికత్తూ డబ్బులను అబ్కారీ శాఖ తీసుకుంటుంది. ప్రస్తుతం ప్రతిరోజు రాష్ట్రంలో సుమారుగా 1500 మందిని బైండోవర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.

ప్రోత్సహిస్తే కేసులే..

రాష్ట్రంలో అనేక చోట్ల గుట్టుగా గంజాయి సాగు జరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు వ్యవసాయ శాఖ, అబ్కారీ శాఖ కలిసి పనిచేస్తున్నారు. టెక్నాలజీతోపాటు గ్రామాల్లో ఉన్న ఏఈవోల సాయం తీసుకుంటున్నారు. శాటిలైట్​ఫొటోల ద్వారా ఎక్కడ గంజాయి సాగు జరుగుతుందో కనిపెడుతున్నారు. ఇక గంజాయి తీసుకోవడం, సాగును ప్రోత్సహించినా, సాగు, రవాణా విషయం తెలిసినా పోలీసులు, అబ్కారీ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వకున్నా.. సదరు వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఇక రైతుబంధుతోపాటు ఇతర పథకాలు వర్తించవని హెచ్చరిస్తున్నారు.

డ్రగ్స్​అనర్థాలపై అవేర్​నెస్​

డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయిపై  గ్రామాల్లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల దాకా అవేర్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌ చేపడుతున్నారు. ఇందులో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, లీడర్లు, సోషల్‌‌‌‌‌‌‌‌ వర్కర్లను ఇన్వాల్వ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయి తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాలను వివరిస్తున్నారు. సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా ద్వారా కూడా క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు

ప్రతిరోజు క్రిమినల్ కేసులు, పీడీ యాక్ట్​

రాష్ట్రంలో 140 అబ్కారీ ఠాణాలు ఉన్నాయి. అయితే ఇప్పటి దాకా డ్రగ్స్, గంజాయి తీసుకోవడం, అమ్మకాలపై చూసీచూడనట్లు వ్యవహరిచేవారనే ఆరోపరణలు ఉన్నాయి. ఇటీవల డ్రగ్స్, గంజాయిపై సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ రెండు సార్లు రివ్యూ చేశారు. కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. దీంతో అబ్కారీ అధికారులు డ్రగ్స్, గంజాయి తీసుకోవడం, అమ్మకాలు, రవాణాపై కఠినంగా ఉంటున్నారు. ఇక ప్రతి రోజు క్రిమినల్‌‌‌‌‌‌‌‌, పీడీ యాక్ట్‌‌‌‌‌‌‌‌లు బుక్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. రెండోసారి దొరికితే వెంటనే పీడీ యాక్ట్‌‌‌‌‌‌‌‌ పెడుతున్నారు. పెద్ద మొత్తంలో ఒకసారి పట్టుబడి.. మళ్లీ కొద్దిమేర దొరికినా వదిలిపెట్టడం లేదు. పాత పెండింగ్‌‌‌‌‌‌‌‌ కేసులను కూడా తోడుతున్నారు.